YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ: "అంతరిక్షం"..!!

రివ్యూ: "అంతరిక్షం"..!!

 'ఘాజి' సినిమాతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసాడు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. మరోసారి కొత్త కథతో మన ముందు కి వచ్చాడు సంకల్ప్. మరో వైపు ‘కంచె’ సినిమా నుంచి వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నారు వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరూ టచ్‌ చేయని కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఇద్దరు కలిపి తలపెట్టిన ప్రాజెక్ట్ ఏ "అంతరిక్షం". ఈ సినిమా మన ముందు కి ఈ రోజు వచ్చింది. ఈ సినిమా రివ్యూ చూదామా.
రివ్యూ:
దేవ్‌ (వరుణ్‌తేజ్‌) ఓ వ్యోమగామి. రష్యాలో శిక్షణ పొంది పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. అతనికి ఓ సవాలు ఎదురవుతుంది. ‘విప్రయాన్‌’ అనే శాటిలైట్‌ కక్ష్యలోకి వెళ్లాక విఫలం అవుతుంది. దాని వల్ల మిగిలిన ఉపగ్రహాలకు నష్టం వాటిల్లుతుంది. దాన్ని సరిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా కమ్యునికేషన్‌ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇది భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారుతుంది. దానిని డీకోడ్‌ చేయడానికి దేవ్‌ అవసరం ఏర్పడుతుంది. అయితే అప్పటికే తన ఉద్యోగాన్ని వదిలేసి దేవ్‌ దూరంగా వెళ్లిపోతాడు. అసలు దేవ్‌ ఎందుకు వెళ్లిపోయాడు? ఈ విప్రయాన్‌ సవాలును దేవ్‌ స్వీకరించాడా? లేదా? అంతరిక్షంలో భారతదేశ కీర్తి పతాకాన్ని దేవ్‌ ఎలా ఎగురవేశాడు? అన్నదే కథ.

 వరుణ్‌ తేజ్‌ ముందు నుంచీ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. ప్రతి పాత్రకు న్యాయం చేస్తున్నారు. ఈ సినిమాలోనూ దేవ్‌ పాత్రకు తన వంతు న్యాయం చేశారు. వ్యోమగామిగా అతని నటన ఆకట్టుకుంటుంది. లావణ్య త్రిపాఠి పాత్ర చిన్నదే అయినా ఆమెకూ ప్రాధాన్యం ఉంది. అదితి రావు హైదరి వ్యోమగామి పాత్రలో కనిపిస్తారు. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సత్యదేవ్‌, రఘు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. సాంకేతికంగా దర్శకుడి ఆలోచన గొప్పది. మన తెలుగు వాతావరణానికి, ఇక్కడి కమర్షియల్‌ సూత్రాలకు విభిన్నమైన కథను ఎంచుకున్నారు. తను రాసుకున్న కథను చెప్పే ప్రయత్నంలో ఎక్కడా తడబాటు పడలేదు. పక్కదారీ పట్టలేదు. కాకపోతే ఇలాంటి కథలు ఎంత మందికి చేరువవుతాయని దర్శకుడు ఆలోచించుకుని ఉంటే బాగుండేది. కళాదర్శకుల ప్రతభ, కెమెరా పనితనం అబ్బురపరుస్తాయి. గాల్లో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. పాటలు తక్కువే. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది.

బలాలు:
 సరికొత్త నేపథ్యం

  దర్శకుడి ఆలోచన

 సాంకేతిక నిపుణుల పనితనం

బలహీనతలు:
స్లో నరేషన్‌

Related Posts