YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

గంభీర్‌కు అరెస్ట్ వారెంట్ జారీచేసిన న్యూ ఢిల్లీ కోర్టు..!!

గంభీర్‌కు అరెస్ట్ వారెంట్ జారీచేసిన న్యూ ఢిల్లీ కోర్టు..!!

మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ రుద్రబిల్డ్ వెల్ రియాల్టీ ప్రయివేటు లిమిటెడ్, హెచ్ఆర్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవరహించారు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మోసానికి పాల్పడింది. దీనిపై మోసపోయిన బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. ఘజియాబాద్ లో నిర్మించనున్న ఫ్లాట్ల కోసం 17 మంది కొనుగోలుదారులు రూ.1.98 కోట్లను చెల్లించారు. కాని ఫ్లాట్ల నిర్మాణం చేపట్టలేదు. తాము గౌతం గంభీర్ ను చూసి ఫ్లాటు కోసం డబ్బు చెల్లించి మోసపోయామని కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు క్రికెటర్ గౌతం గంభీర్ కు ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యూఢిల్లీ కోర్టు గౌతం గంభీర్ కు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

 

Related Posts