ఏలూరు ఎంపి మాగంటి బాబు ఆప్యాయతకు, మంచితనానికి ఒక నిదర్శనంగా నిలుస్తారని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక రాయచంద్రరావు పేట లోని ఎంపి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాగంటిబాబు ,పద్మవల్లీదేవి ద్వితీయ కుమారుడు దామోదర రవీంధ్రనాధ్ చౌదరిని పెళ్లికొడుకు చేస్తున్న సందర్భంగా గంటా శ్రీనివాసరావుతో పాటు విజయవాడ ఎంపి కేసినేని నాని, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, తెలుగువేశం రాష్ట్ర నాయకులు కంబంపాటి నుండి ప్రజాసేవలో కొనసాగడానికి మాగంటి మంచితనమే కారణమని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇతరులకు ఆతిధ్యం ఇవ్వడంలో మాగంటి కుటుంబం ఎంతో శ్రమిస్తుందని ప్రతీ ఒక్కర్ని కలుపుకొని ఎప్పుడూ కూడా అందరికి పండ్లు, నాన్ వెజ్ టేరియన్ ఫుడ్స్ ను అందిస్తూ అందరిని మన్ననలను పొందారని గంటా శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ సదస్సులో కూడా మాగంటి ఇచ్చే విందూ అందరూ ఆరగించాలని, ఎంతో శ్రద్ద తీసుకొని స్వయంగా వడ్డణ చేయడం కూడా తననెంతో ఆకట్టుకుందని ఎంపి కేసినేని నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, దుర్గరావు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు యాగంటి రామేష్, ప్రముఖ వ్యాపారవేత్త ఆర్ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.