YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

రెండేళ్ల జైలు శిక్ష పడిన ఎమ్మెల్యేకు బెయిల్

 రెండేళ్ల జైలు శిక్ష పడిన ఎమ్మెల్యేకు బెయిల్

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌‌పై దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన దెందులూరు ఎమ్మెల్యే, రాష్ట్రప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.  దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రచ్చబండ కార్యక్రమం జరిగింది. దీనికి అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ హాజరవ్వగా.. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగి కార్యక్రమం రసాభాసగా మారింది.. ఈ ఘటనలో ప్రభాకర్ తనపై దాడి చేశారంటూ మంత్రి వట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన భీమడోలు న్యాయస్థానం చింతమనేని దోషిగా నిర్థారిస్తూ.. ఇవాళ తుది తీర్పును వెలువరించింది. అయితే శిక్ష పడిన కాసేపటికే ఎమ్మెల్యే ప్రభాకర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Related Posts