YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రజినీకాంత్ ఛానల్ ఏర్పాటు..ఆ తర్వాతే రాజకీయ అరంగ్రేట్రం

రజినీకాంత్ ఛానల్ ఏర్పాటు..ఆ తర్వాతే రాజకీయ అరంగ్రేట్రం
తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్టీ పేరు ప్రకటించక ముందే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇప్పటికే రజినీ మక్కల్ మండ్రమ్ పేరుతో అభిమానులను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్న తలైవార్.. తన వాణిని బలంగా వినిపించేందుకు టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఛానల్ కోసం చేసిన దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. టీవీ ఛానల్ కోసం రజినీ అభిమానుల సంఘం కన్వీనర్ సుధాకర్ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్లై చేశారు. రజినీ తన పేరు, ఫొటోను ఉపయోగించుకునేందుకు సమ్మతిని తెలుపుతూ ఓ లేక కూడా ఇచ్చారు. నవంబర్ 9న అప్లై చేశారు. అయితే కేవలం న్యూస్ మాత్రమేనా.. లేక ఎంటర్టైన్మెంట్ ఛానలా అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవార్ టీవీ.. పేర్ల కోసం అప్లై చేయగా.. ఆరు లోగోలను కూడా దరఖాస్తులతో పాటు జతచేశారు. అందులో సూపర్ స్టార్ టీవీకి రజినీకాంత్ క్యారికేచర్స్‌తో కూడిన లోగో ఇచ్చారు.ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. రజినీ పేరును దురపయోగానికి గురి చేసే అవకాశం ఉండటంతో ఇలా చేసుంటారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఛానల్ ఏర్పాటు ద్వారా తన రాజకీయ ప్రవేశాన్ని.. అవశ్యకతను బలంగా చాటేందుకు రజినీ సర్వం సన్నద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts