YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నడవడానికి తప్ప జగన్‌ తన కర్తవ్యం నిర్వర్తించడం లేదు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

నడవడానికి తప్ప జగన్‌ తన కర్తవ్యం నిర్వర్తించడం లేదు           మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
ప్రతిపక్ష నేత జగన్‌ తన కర్తవ్యం నిర్వర్తించడం లేదు. కేవలం నడవడానికే జగన్‌ సమయం కేటాయిస్తున్నారని కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనకాపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపై స్పష్టత లేదని చెప్పారు. 50 ఏళ్లుగా జరిగిన ఎన్నికలు వేరు.. వచ్చే ఎన్నికలు వేరని వ్యాఖ్యానించారు. అనకాపల్లికి ఆర్డీవో కార్యాలయం, మహిళా డిగ్రీ కాలేదజీ, మోడల్ స్కూళ్లని తానే మంజూరు చేశానని గుర్తుచేశారు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో కూడా ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్‌లు చేయించాలని సీఎం చంద్రబాబుకు కిరణ్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి పనులు చేయించగలిగే వారికే ఏపీలో ఓటు వేయాలని, ఏపీకి విభజన హామీలు అమలయ్యే సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ ప్రధానిగా ఉండాలన్నారు.40 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రూ.1800 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని, కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ ఎన్నికలు దాటితే ప్రత్యేక హోదా పాతబడిపోతుంది. రాహుల్‌ని ప్రధాని చేస్తే ఏపీ 25ఏళ్లు ముందుకెళ్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వేయబోయే ఓటు జీవితాలను మారుస్తుంది. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించాలని కిరణ్‌ పిలుపునిచ్చారు.

Related Posts