YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొణతాల ఆరాటం వైసీపీకి చెలగాటం..

కొణతాల ఆరాటం వైసీపీకి చెలగాటం..
2019 ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయ‌డానికి రాజ‌కీయ పార్టీల‌ను వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు టీడీపీ, ఎలాగైన గెలిచేందుకు వైసీపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన త‌మ ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు టీడీపీ, వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు చూపిస్తున్నాయి. ఎన్నిక‌లు స‌మీపించే కొద్ది ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. స‌ర్వేల్లో ఒక అడుగు వైసీపీ ముందంజ‌లో ఉంది. కాని తాజాగా మాజీ మంత్రి కొణ‌తాల ప్ర‌క‌ట‌న వైసీపీలో క‌ల‌వ‌రం రేపుతోంది. వైసీపీ ఊపు గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని ఆ పార్టీలో చాలా కాలం పాటు ఉన్న మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అంచనా వేస్తున్నారు. 2014 నాటికి ఇప్పటికీ చూసుకుంటే వైసీపీ మీద జనానికి మోజు తగ్గిందని ఆయన అంటున్నారు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికార పార్టీ టీడీపీని సమర్ధంగా వైసీపీ ఢీ కొట్టలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరో పార్టీ జనసేన తీరు చూస్తే సంస్థాగతంగా ఆ పార్టీ ఇప్పటికీ నిర్మాణం లేక బలహీనంగా ఉందని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ కి ఆదరణ ఉన్నా జనంలో పార్టీని గట్టిగా నిలబెట్టలేకపోయారని అన్నారు. ఏపీలో వామపక్షలు తీరు తలో విధంగా ఉందంగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసుకుంటే విపక్షాల ఆనైఖ్యత టీడీపీకి ప్లస్ గా ఉందని కొణతాల అంచనా వేశారు. ఇప్పటికైతే టీడీపీ ఏపీలో బలంగా ఉందని ఆయన అన్నారు. మరో వైపు తాను తొందరలోనే ఏ రాజకీయ పార్టీలో చేరేదీ నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న కొణతాల టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రకు మేలు చేస్తున్నారని కీర్తించడం విశేషం. మొత్తానికి చూసుకుంటే ఈ మాజీ మంత్రి గారు త్వరలోనే సైకిలెక్కబోతున్నారని అర్ధమవుతోంది. కొణ‌తాల విశ్లేష‌ణ‌ను వైసీపీ అంతా వీజీగా తీసుకొవ‌ద్ద‌ని భావిస్తోంది. నిజంగా పార్టీ గ్రాఫ్ ప‌డిపోయిందా అనే విష‌యం తెల్చుకునేందుకు గ్రౌండ్ లెవెల్ స‌ర్వే చేయాల‌ని భావిస్తోంద‌ట‌. మ‌రి అధినేత జ‌గ‌న్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Related Posts