'మారి 2'తో నిన్ననే ప్రేక్షకులను పలకరించిన ధనుశ్, ఈ రోజున తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను వదిలాడు. ధనుశ్ తదుపరి చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరోమారు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.