నెల్లూరు లో గుంతల రోడ్లలో పడి ప్రజలు గాయాలపాలవుతున్నా, మురికినీరు సరఫరా అవుతున్నా పట్టించుకోరా అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. శనివారం ప్రజాఘోష పేరుతో కార్పొరేషన్ ఎదుట రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన ప్రదర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ అస్థవ్యస్తంగా మారిందంటూ గాంధీగిరిలో అయన ఆందోళన కు దిగారు. ఈ కార్యక్రమానికి వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాంతో అందోళనకారులను కార్పొరేషన్లోకి వెళ్లనీకుండా సోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మల్యే తరువాత కార్పొరేషన్లోకి వెల్లి కమిషనర్కు వినతిపత్రం అందజేసారు. రెండు రోజుల్లో లిఖితపూర్వక హామీ ఇస్తామని కమిషనర్ అంగీకరించారు. ఈ నెల 26వ తేదీ వరకు సమయం ఎమ్మెల్యే ఇచ్చారు. అప్పటిలోపు లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే ఆమరణ నిరాహారదీక్షకు సిద్దమని హెచ్చరించారు.