- ఎన్నికలను తలపిస్తున్న కర్ణాటక రాజకీయం
- ప్రచారంలో పోటీపడుతున్న ప్రధాన పార్టీలు
- ప్రత్యర్థులపై విసుర్లు, చెణుకులు
- ముందస్తు ప్రసంగ పాఠాల తయారీకి ఇది దర్పణం.
కర్ణాటకలో అప్పుడే ఎన్నిక వేడి రాజుకుంది. ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తహా తహాలాడుతున్నారు. దీంతో ఆ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలను తలపించేవిధగా మూడు ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, భాజపా, జనతాదళ్ (ఎస్) పోటాపోటీగా ప్రచారపర్వాని కొనసాగిస్తున్నాయి. ఇందుకు ఆయా పార్టీలు సామాజిక మాధ్యమాలను వేడుకగా చేసుకున్నాయి. మూడు పార్టీల్లోని. కొందరు పార్టీపై అభిమానంతో స్వచ్ఛందంగా సేవలందిస్తుండగా చాలా మంది తాత్కాలిక సిబ్బందిగా వేతనానికి పనిచేస్తున్నారు. వీరంతా నిరంతరంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా తమ నేతల ప్రసంగాలు, పార్టీ కార్యక్రమాల్ని శరవేగంగా పంపిస్తున్నారు. ఇతర పక్షాల నేతల వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలకు క్షణాల్లో స్పందిస్తున్నారు. ఆయా సందర్భాన్ని బట్టి తమ నేతల ట్విట్లర్లు. ఫేస్‌బుక్ ఖాతాల్లో వారి ప్రమేయం లేకుండానే ప్రత్యర్థులపై విసుర్లు, చెణుకులు విసురుతున్నారు.
150 మంది 8 బృందాలుగా ప్రచార విధులు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో రెండు వేర్వేరు సామాజిక మాధ్యమ విభాగాలు పని చేస్తున్నాయి. సిద్ధరామయ్య కార్యాలయంలో 150 మంది 8 బృందాలుగా విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇటీవల నిర్వహించిన నవనిర్మాణ యాత్రలో చేసిన ప్రసంగాలు, ఛాయాచిత్రాలు, వీడియోలు వెంటవెంటనే సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ప్రదేశ్ కాంగ్రెస్ సమితి తరఫున ప్రతి విధానసభ నియోజకవర్గంలోనూ ఒక్కొక్కరు సామాజిక మాధ్యమ కార్యకర్త లేక ఉద్యోగి విధుల్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో నేతల పర్యటనల వివరాలనూ సామాజిక మాధ్యమాలకు ఎప్పటికప్పుడు ఎక్కిస్తున్నారు. పలువురు మంత్రులు సామాజిక మాధ్యమాల్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. రాయచూరు, కలబురగి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు స్థానికులకు దృశ్య శ్రవణ వ్యవస్థ లోపాలవల్ల కొన్ని ప్రాంతాల్లో వినపడలేదు. ఫేస్‌బుక్‌లో ఆయన్ను అనుసరించే వారికి క్షణాల్లో ఉపన్యాసం పొల్లు పోకుండా వినిపించింది.
నిపుణులతో బృందం..
భాజపాకు రాష్ట్రస్థాయిలో నిపుణులైన సభ్యులతో కూడిన బృందం నిరంతరం సామాజిక మాధ్యమాలకు సమాచారాన్ని అందిస్తోంది. జిల్లా, విధానసభ నియోజకవర్గాల్లోనూ ఒకరు లేక ఇద్దరు నియోజకవర్గాలు విధుల్ని నిర్వర్తిస్తున్నారు. భాజపా రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప సాగించిన పరివర్తన యాత్రలో నాలుగు బృందాలు పాల్గొన్నాయి. కీలక నేతలు అనంత కుమార్, శోభ కరంద్లాజె, ప్రతాపసింహ, సురేశ్ కుమార్, సి.టి.రవి, అనంత కుమార్ హెగ్డే వ్యక్తిగతంగానూ సామాజిక మాధ్యమాల ఉద్యోగుల్ని నియమించుకున్నారు.
50 మందిసతో ప్రత్యేక విభాగం..
జనతాదళ్‌లోని సామాజిక మాధ్యమ విభాగంలో 50 మంది పని చేస్తున్నారు. హెచ్‌డికె యాప్. మనమనెగె కుమారణ్ణ, ఈ సారి జనతాదళ్.. అంటూ ఉపశీర్షికలతో సామాజిక మాధ్యమాలు పని చేస్తున్నాయి. ఇతర పక్షాల కంటే ముందుగా ఈ విభాగంలో దళ్ ప్రచారాన్ని ప్రారంభించింది.
.