తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ లకు ఎలా గిరాకి ఉందొ అంత కంటే ఎక్కువగా అస్సాం రాష్ట్రం లోని ప్రజలు ఎలుక మాంసానికి ఎగబడటంతో అక్కడి మార్కెట్లలో డిమాండ్ ఏర్పడింది. మాంసహారులు ఎక్కువగా ఎలుక మాంసాన్ని లాగించేస్తుండటంతో నిత్యం క్వింటాళ్ల కొద్దీ ఎలుక మాంసం అస్సాం మార్కెట్లలో అమ్ముడవుతుందట. దీంతో కిలో మాంసం ధర ఏకంగా రూ. 200కు పైగానే పలుకుతోందని తెలుస్తోంది. అయితే ఈ ఎలుక మాంసం దొరికే మార్కెట్ అస్సాంలోని బక్సా జిల్లాలో ఉన్న కుమరికటలో ఉంది. ఇక్కడ ఎటూ చూసినా ఎలుకల మాంసమే కనిపిస్తుంది. జనాలంతా ఎలుక మాంసం కొనడం కోసం పోటీ పడుతుంటారట. ఎలుకలను అస్సాంలోని నైబరి, బర్పెట ప్రాంతాల నుంచి పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారట. ప్రతి ఆదివారం మాత్రమే ఈ మార్కెట్ ఉంటుందట.