నేపాల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొటానికల్ ఫీల్డ్ ట్రిప్ కోసం వెళ్లి వస్తున్న ఓ స్కూల్ బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం ఓ మారుమూల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందనీ... బస్సులో విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 37ప్రయాణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన విద్యార్ధులంతా16 నుంచి20 లోపు వారే ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు, డ్రైవర్ కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు.కాగా ప్రమాదం గురించి సమాచారం అందగానే సహాయక బృందాలు ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధిక వేగం కారణంగానే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలింద ని పోలీస్ అధికారి బెల్ బహదూర్ పాండే పేర్కొన్నారు. అస్తవ్యస్తమైన రోడ్లువాహనాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా ఇటీవల నేపాల్‌లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం సెంట్రల్ నేపాల్‌లో జరిగిన ఓ ట్రక్కు ప్రమాదంలో20 మంది ప్రాణాలు కోల్పోయారు.