YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్‌ సర్కార్‌కు మళ్లీ ఆర్థిక కష్టాలు

ట్రంప్‌ సర్కార్‌కు మళ్లీ ఆర్థిక కష్టాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరోసారి స్తంభించింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఈ విషయంపై ట్రంప్‌, డెమోక్రాట్ల మధ్య రాజీ కుదరలేదు. దీంతో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమెరికా ప్రభుత్వం పాక్షికంగా స్తంభించిపోయింది.
ఈ విషయాన్ని ట్రంప్‌ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందని ఆయన అసహనం చెందారు. అయితే ఇది ఎంతోకాలం ఉండకపోవచ్చని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్తంభనతో ఆర్థిక ఖజానా మూతపడింది. దీంతో కేబినెట్‌ స్థాయిలోని 15 విభాగాల్లో తొమ్మిదింటికి ఖజానా నుంచి ఎలాంటి నగదు అందదు. నిధుల కొరత వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. క్రిస్మస్‌ సీజన్‌లో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇళ్లకే పరిమితం కానున్నారు. కాగా.. అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం.మరోవైపు అమెరికా ఫెడరల్‌ వ్యయ బిల్లు విషయంపై శ్వేతసౌధం అధికారులు, రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ నేతల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం కూడా ఈ చర్చలు కొనసాగనున్నాయి

Related Posts