జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన కుటుంబంలో కలిసి యూరప్ వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం క్రిస్మస్ పండగ సమయలో నిర్వహించాల్సి ఉన్నందున భార్య అన్నా లెజెనోవా, పిల్లలతో కలిసి ఆయన యూరప్ వెళ్లారు. క్రిస్మస్ తర్వాత ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పవన్.. ఇక పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకే సమయం కేటాయిస్తారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.