ఇండోనేషియాను సునామీ ముంచెత్తింది. శనివారం రాత్రి 9.30గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సంభవించిన సునామీ ధాటికి 43 మంది మృతి చెందగా, సుమారు 600 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో సునామీ వచ్చినట్లు వెల్లడించారు. అగ్నిపర్వతం బద్దలవడంతో సునామీ సంభవించినట్లు సమాచారం.