ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు
రాష్ట్రంలో అప్పుడే పరీక్షల కాలం వచ్చేస్తుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇంటర్ బోర్డు అధికారులు తలమునకలవుతున్నారు.. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి 9.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 4.75 లక్షల మంది ఫస్టియర్, 4.50 లక్షల మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రైవేటు విద్యార్థులు 1.25 లక్షల మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,560 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ పరీక్షల నిర్వహణ అధికారి సుశీల్‌కుమార్ తెలిపారు. హాల్‌టికెట్ల పంపిణీ రెండురోజుల్లో మొదలవుతుందని, విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.