YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఈరోజు పాశుర‌ము

ఈరోజు పాశుర‌ము

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు
ఉన్నైకూవువాన్ వన్దు నిన్రోమ్
కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

*అర్ధ‌ము*

ఓ ప‌రిపూర్ణ‌మైన‌ వ‌నితా తూర్పు దిక్కు తెల్ల‌బ‌డి౦ది ప‌శువులు త‌డిసిన‌ ప‌చ్చిక‌ను మేయ‌డానికి అ౦త‌టా తిరుగుతున్నాయి.
శ్రీక‌ృష్ణుని వ‌ద్ద‌కు వెళ్ళ‌డ‌మే ప్ర‌ధాన‌ ఉద్దేశ‌ముగా వెళుతున్న‌ గోప‌యువ‌తుల‌ను ఆపి నిన్ను పిలుచుట‌కు నీ వ‌ద్ద‌కు వ‌చ్చేము. కేశి అనే రాక్ష‌సుని చ౦పిన‌వాడు నిత్య‌సూరుల‌కు ప్ర‌భువు అయిన‌ శ్రీక‌ృష్ణుని ద‌గ్గ‌ర‌కు పోయి వ్ర‌త‌మున‌కు కావ‌ల‌సిన‌ వాయిద్య‌మును తీసుకొని గాన‌ముచేసిన‌చో మ‌న‌య౦దు క‌రుణి౦చి శ్రీక‌ృష్ణుడు మ‌న‌కు సేవ‌ సాయి౦చును క‌నుక‌ లేచిరా!

*జ‌య‌ శ్రీమ‌న్నారాయ‌ణ‌*
*జ‌య‌ రామానుజ‌*

*భగవద్భక్తి సాధన మార్గం* 

*భగవంతుని మాయ*

              రామకృష్ణ పరమహంస తన శిష్యులకి ఒక కథ చెప్తూ ఉండేవారు భగవంతుని మాయ గురించి. ఒకనాడు నారద మహామునికి భగవంతుడి మాయ ఎలా ఉంటుందో చూడాలని కోరిక కలిగింది. వెంటనే భగవంతుడిని ధ్యానం చేస్తే ఆయనకు భగవంతుడు సాక్షాత్కరించారు. పట్టు పీతాంబరం ధరించినవారై శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి, నల్లని మేఘం వంటి శరీరవర్ణంతో *పరమాత్మ శ్రీమన్నారాయణుడు* ప్రత్యక్షమయ్యారు.

                నారదులవారు ఆయనకి నమస్కరించి, తండ్రి 'దివ్యమైన నీ మాయను నేను చూడాలనుకుంటున్నాను. నా యందు కారుణ్యం వహించి నాకు మీ మాయను చూపించండి" అనగా భగవంతుడు చిన్నగా నవ్వి, అలాగే అని కానీ నేను చిన్న పని మీద వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటే రా అన్నారు. అలా ఇద్దరు చాలా దూరం ప్రయాణించిన తర్వాత భగవానుడు, "నారదా, నాకు దాహంగా ఉంది, ఇక్కడ కొంచెం దూరంలో చిన్న సరస్సు ఉంది, వెళ్లి నీళ్లు తీస్కొని రా" అని అడగగా, మహర్షి సరస్సు కోసం వెతుకుతూ వెళ్లారు. ఎక్కడా సరస్సు కనపడలేదు. చాలా దూరం వెతికి వెతికి అలిసిపోయి ఒకచోట కూర్చుని ఉండగా అటుగా ఒక అందమైన యువతీ వెళ్ళటం చూసారు. ఆమె సౌదర్యం అతి రమణీయంగా, చక్కటి ఇంపు,సొంపులతో కూడిన శరీర ఆకృతితో, అందర్నీ ఆకర్షించేలా ఉంది. నారదులవారు ఆమె సౌందర్యానికి ముగ్ధులైపోయారు. ఆమెయందు మొహంతో, ఆమె వెనకాలే వెళ్ళటం ప్రారంభించారు. అమెతో, "ఓ యువతీ నేను మహర్షిని, నీ అందం నన్ను బానిసను చేసింది, నాకు పెళ్ళి చేసుకోవాలనిపించింది" అని చెప్పారు. అందుకు ఆమె సరే అని ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక చిన్న గుడిసెలో చక్కగా కాపురం చేయసాగారు. చాలా మంది పిల్లలను కన్నారు. ఆ ఆనందంలో రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. 

                  ఇంతలో ఆ రాజ్యంలోకి భయంకరమైన వ్యాధి ఒకటి వ్యాపించి, ఆ రాజ్యాన్ని కబళించసాగింది. ప్రజలంతా వేరే రాజ్యానికి వలస వెళ్ళసాగారు. మహర్షులవారు, తన భార్య, చిన్న పిల్లలను తీస్కొని పక్కనే ఉన్న నదిని దాటి వేరే రాజ్యానికి వెళ్లాలని నిశ్చయించి, ఆ నదీ మార్గం గుండా పడవలో వెళ్ళసాగారు. ఇంతలో పెద్ద వరద వచ్చి ఆ వరద నీటిలో పడవ చిక్కుకుపోయింది. ఉధృతమైన వరద నీటిలో చూస్తుండగానే పిల్లలు కొట్టుకుపోయారు, కొన్ని క్షణాల తర్వాత భార్య కూడా అలానే  నీటిలో మునిగిపోయి శరీరాన్ని వదిలిపెట్టారు. నారదులవారు నీటిలో ఈదుకుంటూ తీరప్రాంతానికి వచ్చి పడ్డారు. క్షణాల్లో తన కుటుంబం ఇలా అయిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తూ తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇంతలో వెనుకనుంచి ఎవరో పిలవగా వెనక్కి తిరి చూసారు, వెనుక భగవంతుడు ఆయనతో "నారదా, నీళ్లు తీస్కొని రావడానికి అని వచ్చి ఇక్కడ కూర్చొని ఏంచేస్తున్నావ్ అనగానే ఆయనకి బాహ్య స్మృతి వచ్చింది". ఒక్కసారి పక్కకి చూడగానే, అక్కడ వరద లేదు, సరస్సు లేదు, నీళ్లు లేవు. ఇదంతా విష్ణు మాయ అని గమనించిన నారదులవారు, పరమాత్మ పాదపద్మముల మీద పడి, "అర్థమైంది తండ్రి నీ మాయ. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు నీ మాయ గురించి చెప్తుంటే ఏంటో అనుకున్న ఈరోజు నాకు నీ దివ్యమైన మాయ అవగతమైనది.  కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. ఈ రెప్పపాటి క్షణం కోసం మనిషి నీయందు భక్తిని విడిచి సంసారంలో పడి, ఇదే శాశ్వతం అనుకోని పునర్జనలయందు తిరుగుతూచున్నాడు. ఎవడు నీ నామ స్మరణ చేస్తున్నాడో, జీవితకాలం నీ పాదములను నమ్ముకొని బతుకుతున్నాడో అట్టివాడు ఈ భవబంధాలను వీడి నీకు దాసుడై, నీ ఆనందం తప్ప ఇంకేమి లేని నీ బృందావనలోకాన్ని చేరుకొని ఇక మళ్ళీ పుట్టనవసరం లేని స్థితికి చేరుకుంటున్నారు. 

      సృష్టిలో విష్ణు మాయ అత్యంత బలీయమైనది. ఋషులు, సిద్దులు, సమస్త జీవరాసులు, దేవతలు కూడా ఈ మాయకు దాసులు, విష్ణువు యందు భక్తి, జ్ఞానంతో తప్ప వేరే దేనితోనూ ఈ మాయని ఛేదించలేరు. అయన లీలలు చాలా దివ్యమైనవి. మరి విష్ణుమాయ ఎవరిమీద ప్రసరించదు అంటే, *భగవద్గీతలో(7.14) కృష్ణ పరమాత్మ* మనకి  అభమిచ్చారు, *మమ మాయా దురత్యయా*, సృష్టిలో ఎవ్వరు నా మాయను అధిగమించలేరు కానీ ఎవరో నాయందు పరమభక్తితో ఉంటారో అట్టి వారిని నా మాయ బాధించదు. ఎల్లప్పుడూ కృష్ణ నామాన్ని, కృష్ణ కథలను ప్రచారంగావిస్తూ, కృష్ణ భక్తిలో జీవితాన్ని గడపటం వలన, సంసారంలో ఉన్నప్పటికీ అతనికి తామరమీద బురద వలే పాపము అంటదు. అటువంటి వారిని కృష్ణుడే సర్వకాలములయందు కాపాడుకుంటూ ఉంటారు. 
      *సర్వేజనా సుఖినోభవంతు*.

Related Posts