రానున్న లోక్‌సభ ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదని, కుల, మత, పక్షపాత ధోరణితో చేసే రాజకీయాలకు ముగింపు పలుకుతాయని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దిల్లీలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘ప్రధాని మోదీని గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టాలని కోరడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో దిల్లీలో ప్రధానంగా భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంటుంది. రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక అసత్యాలు ఆడిన నేతలుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.