- ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కు రెడీ
- ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వెర్షన్ కు సపోర్ట్
- రెగ్యులర్ వెర్షన్ కంటే తేలికపాటిది
- అన్ని బేసిక్ ఫీచర్లకూ చోటు
- ఇతర మెయిల్ ఐడీలకూ చోటు
- ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కు రెడీ
గూగుల్ ఇప్పుడు మరో యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా జీమెయిల్ గో యాప్ ను విడుదల చేసింది. గూగుల్ ఇటీవలే ఫైల్స్ గో, గోబోర్డ్ గో, గూగుల్ గో, మ్యాప్స్ గో, యూట్యూబ్ గో అంటూ పలు యాప్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. జీ మెయిల్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే జీమెయిల్ కు సంబంధించి గో ఎడిషన్ యాప్ ను తీసుకొచ్చింది. జీమెయిల్ కు సంబంధించి బేసిక్ ఫీచర్లన్నింటినీ ఇది సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆ తర్వాత వచ్చే వెర్షన్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే, జీమెయిల్ తో పాటు ఔట్ లుక్ డాట్ కామ్, యాహూ మెయిల్ ఇతర ఈ మెయిల్ అకౌంట్లను కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
జీమెయిల్ గో యాప్ అన్నది తేలిక పాటి వెర్షన్. రెగ్యులర్ జీమెయిల్ యాప్ సైజు 20.66 ఎంబీ కాగా, జీమెయిల్ గో వెర్షన్ 9.51ఎంబీయే. రెగ్యులర్ వెర్షన్ యాప్ 47ఎంబీని వినియోగించుకుంటే, గో వెర్షన్ 25 ఎంబీయే వినియోగించుకుంటుంది. ఇక జీ మెయిల్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవదమే ఆలశ్యం.