శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై ఎసిబి అధికారులు సోమవారం ఉదయం దాడులు జరిపారు. రవి కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలాస, మందస, పూండిలో మూడు చోట్ల, గొప్పిలి, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మూడు చోట్ల, విజయనగరం లోని ఆయన కార్యాలయంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. రవికుమార్ బందువయిన పలాస డిపో మేనేజర్ పెంట శివకుమార్ ఇళ్లు, పలాస లోని ఆయన బంధువులు డాక్టర్ కోదండరావు, లీలా కుమారి, హనుమంతు అమరసింహం ఇళ్లల్లో కుడా సోదాలు జరిపారు. ఈ సందర్బంగా పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాల దస్త్రాలు, ఫ్లాట్ లు, నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.