YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సొట్ట పడిన సొట్ట బుగ్గల అలీ..!!

 సొట్ట పడిన సొట్ట బుగ్గల అలీ..!!

  యువ్ న్యూస్ సినిమా బ్యూరో:

       తన స్టైల్ టైమింగుతో.. ప్రతి సినిమాలో కొత్త కొత్త వేషాలతో అందరిని నవ్విస్తూ బ్రహ్మనందం తరువాత టాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు  'అల్ టైం కమెడియన్' అలీ. అయన  పూర్తి పేరు మొహమ్మద్ అలీ. అయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి. అయన 1981 లో 'సీతాకోక చిలుక' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసారు. ఆ చిత్రంలో అయన నటించిన పాత్రకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు వచ్చింది.. ఆ చిత్రం తరువాత అయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ బాషలలో 1000 చిత్రాలు పైగా నటించారు. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్లు అలీ లేకుండా సినిమా ఒప్పుకోరు. హీరోలే కాదు పూరి జగన్నాధ్ వంటి పెద్ద డైరెక్టర్లు కూడా అలీ లేకుండా సినిమా చేయరు. 'చిరుత', 'పోకిరి', 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'జంబ లకిడి పంబ', 'సూపర్', 'కిక్' మొదలగు చిత్రాలలో అలీ చేసిన కామెడీ ఎప్పటికి మరచిపోలేము. అలీ ఆడ వేషం వేసిన, గే వేషం వేసిన ఆ పాత్రలో లీనం అయిపోతాడు.  కమెడియన్ గా మాత్రమే కాదు ఎస్వీ. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో హీరోగా 'యమలీల' చిత్రాన్ని చేసాడు.. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఒక కమెడియన్ హీరోగా మారి.. ఆ సినిమా 100 రోజులు ఆడింది అంటే మామూలు విషయం కాదు.   తన సొట్ట బుగ్గలతో, వెకిలి చేష్టలతో, అర్ధం కానీ వెటకారపు భాషతో తాను చేసే కామెడీ మరువలేనిది. ఒక సినిమాలోనే కాదు ఏ వేడుకైన అలీ మైక్ పట్టుకున్నాడు అంటే ప్రేక్షకుడి కడుపు చెక్కలవక మానదు. నటనలోనే కాదు సేవ కార్యక్రమాలలో కూడా అలీ ముందుంటాడు. తన తోటి కళాకారులకు ఎటువంటి సహాయం చేయడానికైనా వెనుకాడడు. తన సొంత ఊరైన రాజమండ్రిలో తాను ఒక 40 మందికి పైగా వృద్దులకు మనిషికి నెలకు 2000 సహాయం చేస్తున్నారు.    అటువంటి అలీని ఈ తరం దర్శకులు పక్కన పెటేసారు. దర్శుకలు, నిర్మాతలు డబ్బు.. ఫేమ్ మాత్రమే చూస్తున్నారు తప్ప సగటు ప్రేక్షకుడు సినిమాలో ఎటువంటివి కోరుకుంటారో పసిగట్టలేకపోతున్నారు.  సినిమా అవకాశాలు సరిగ్గా లేక టీవీ షోలు చేసుకుంటూ ఆయన స్టైల్ తో ప్రేక్షకులను టీవీ లకు కట్టిపడేస్తున్నారు అలీ. బహుశా ఆయనకు వయస్సు అయిపోయింది అనుకుంటున్నారేమో. నవ్వడానికి, నవ్వించడానికి  వయస్సు తో పని లేదని ఈ తరం దర్శకులకి తెలిసినట్టు ఉండదు. ఎప్పుడో వచ్చిన మాయాబజార్ చిత్రంలో రమణ రెడ్డి గారు చేసిన కామెడీ చూస్తుంటే ఇప్పటికి నవ్వొస్తది. పోనీ ఇప్పటి కమెడియన్లు వాళ్లకు మించి కామెడీ చేస్తున్నారంటే.. లేదు. వాళ్ళు  స్క్రీన్ ఫై కనిపిస్తే ప్రేక్షకులు వాళ్ళని చూసి కమెడియన్ల, జూనియర్ ఆర్టిస్టుల అని  కంగారు పడుతున్నారు. ఒకప్పటి కామెడియన్లను చూసిన వెంటనే నవ్వొచ్చేది.. ఇప్పుడు వచ్చే సినిమాలలో కమెడియన్లు చేసేది కామెడీ అని అర్ధం చేసుకోవడానికి పది నిముషాలు పడుతుంది. కనుక  నిర్మాతలు, దర్శకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అలీ వంటి కామెడియన్లకు ఛాన్సులు ఇచ్చి ప్రతి ప్రేక్షకుడు మొహంపై చిరునవ్వుతో థియేటర్ విడిచేలా చేస్తారు అని సగటు ప్రేక్షకుడిగా ఆవేదన.

Related Posts