
యువ్ న్యూస్ బ్యూరో:
భగవంతుడు ఎక్కడ, ఏ రూపంలో, ఎలా ఉంటాడు?
సాకారుడా? నిరాకారుడా?
ఈ ప్రశ్నలకి ఇతర మతాలు అస్పష్టమైన సమాధానం ఇస్తాయి..
"మా దేవుడు నిరాకారుడు అంటూనే స్వర్గంలో కుర్చీ పై కూర్చుంటాడు అంటారు..
స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండే దేవుణ్ణి భూమిపై ఉండే విగ్రహాలతో పూజిస్తారా?" అంటూ హిందువులను ఎద్దేవా కూడా చేస్తారు..
వారి కు విమ్మర్శలను తిప్పి కొట్టడమే కాదు, భగవంతుడి యొక్క గుణగణ రూపవైభవాలను వివరించగల సత్తా హిందుత్వానికి మాత్రమే ఉంది.
భగవంతుడు ఏయే రూపాలలో ఉంటాడు అన్న ప్రశ్నకు జగద్గురువులు ఈ విధంగా సమాధానమిచ్చారు.
పరబ్రహ్మ నాలుగు రూపాలలో ఉపస్థితుడై ఉంటాడు.
1 ) విశ్వవ్యాపి;
ఈ స్థితిలో పరమాత్మ విశ్వమంతా పరివ్యాపితమై ఉంటాడు..దుర్నిరీక్షుడై ఉంటాడు..
అంటే ఎవ్వరికీ గోచరం కాడు.ఏ పరమాత్మ వైభవాన్ని శ్లాఘించడానికి, దేవతలు, దేవర్షులు, మహర్షులు విఫలులై , వేదాలు సైతం తమ అశక్తతను తెలియజేస్తాయో అట్టి మహిమాన్విత స్థితి అది.
2 ) పరంధామం;
సృష్టి, స్థితి, లయ కార్యాల నిర్వహణ నిమిత్తం కొన్ని రూపాలు స్వీకరిస్తాడు.
ఆదిశక్తి, పరమశివుడు, శ్రీ మహా విష్ణువు ఇత్యాది రూపాలు.
ఈ స్థితిలో ఉన్న పరమాత్మను దివ్యమైన శరీరం కలిగిన ఇంద్రాది దేవతలు, మహాతపస్సంపన్నులు దర్శించగలరు.
3 ) అవతారమూర్తి;
తాను సృష్టించిన సృష్టిని క్రమబద్దీకరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్ని అవతారాలు తీసుకుంటాడు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నారసింహుడు ఇలాంటి అవతారాలు.
ఈ అవతారాలలో స్థాయీ భేదాలు ఉంటాయి..
అంశావతారాలు, పూర్ణావతారాలు ఉంటాయి.
పరశురాముడు విష్ణువంశ సంభూతుడైతే, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు.
వారు పూర్ణావతారాలు కాదు కానీ, అమేయ శక్తి సంపన్నులు.
శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం.
ఈ స్థితిలో ఉన్న పరమాత్మను దర్శించడమే కాక, ఆయనతో బంధుత్వం, సాన్నిహిత్యం, శత్రుత్వం లాంటి సంబంధాలు పెట్టుకునే మహద్భాగ్యం కొందరు పుణ్యాత్ములకు దక్కింది.
4 ) అర్చామూర్తి ;
భగవంతుని యొక్క కరుణ కు పరాకాష్ట అర్చావతారం.
పై మూడు స్థితులలోనూ పరమాత్మతో సాన్నిహిత్యం కాదు కదా ఆయన దర్శనభాగ్యం కూడా సాధారణ మానవులకు లభించలేదు.
ఒక కామన్ మ్యాన్ కి ముఖ్యమంత్రి అపాయయింట్ మెంట్ దొరకడమే దుర్లభం.
ఈ విశ్వంలో మన భూమి ఒక నలక.
ఇలాంటి కోటానుకోట్ల భూగ్రహాలను,నక్షత్రాలను, పాలపుంతలను సంకల్ప మాత్రం చేత సృష్టించి,లయం చేసే ఆ అల్టిమేట్ సుప్రీం పవర్ ఒక సామాన్యుడి అందుబాటులోకి రావడం మనం ఊహించగలమా? అసలు అది సంభవమేనా?
'సరిహద్దులే లేని,నిరుపమాన భగవంతుని దయతో అది సాధ్యమయింది..'
"సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిం"
భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు ఉన్నపళంగా, పరుగుపరుగున వస్తాడంటూ పోతన భగవత్తత్వాన్ని వర్ణించడంలో అర్ధం ఇదే..
'ఒక సామాన్యుడు పరమాత్మ ను విగ్రహంలో చూస్తూ ఆయన పాదాలు కడగడానికి పాద్యం సమర్పిస్తాడు..
హస్తాలు కడగడకోసం అర్ఘ్యం సమర్పిస్తాడు..
తర్వాత తుడవడానికి మేలిమి వస్త్రం ఇస్తాడు.
పర్వదినాలలో స్వామి పల్లకీ మోసి అత్యానందభరితుడు అవుతాడు.
ఇలా తాను స్వయంగా భగవంతునికే సేవ చేస్తున్నాననే భావన తో భక్తుడు మురిసిపోతుంటే..
భక్తుని సేవలను అంగీకరిస్తూ, అతనికి సేవా భాగ్యాన్ని ప్రసాదించే అమృతతత్వం భగవంతునిది.
'జో అచ్యుతానందా జోజో ముకుందా..'
అని అన్నమయ్య ఊయల లో స్వామిని బుజ్జగిస్తూ జోలపాట పాడుతుంటే పసిబాలకుడై పవళిస్తాడు..
'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..?'
అని రామదాసు నిలదీస్తే..మారు మాట్లాడకుండా వచ్చి తానీషా బాఖీ తీర్చేస్తాడు.
అంతే కానీ "నేను స్వర్గంలో కుర్చీ పై నుండి దిగను గాక దిగనంతే..!
నన్ను విగ్రహంలో పూజిస్తావా? నిన్ను ఏసేస్తా.. నరకంలో వేసి కాలుస్తా.".అనే పైశాచికత్వం భగవంతునికి ఉండదు..
ఇశ్రాయేలీయులు తిన్నారు,పడుకున్నారు,లేచారు అని వాళ్ళ చుట్టూనే తిరుగే ఎడారి మతాలకు..
భగవంతుని అవధులు లేని దయా హృదయాన్ని, ఆయన విస్తృతిని వర్ణించడం ఎలా సాధ్యమౌతుంది?
గత జన్మల సంస్కార బలం లేనివారు,అసుర ప్రవ్రుత్తి కలిగిన వారు అర్చామూర్తిలో భగవంతుని దర్శించలేరు..
పాషండ మతాల ప్రభావానికి లోనై
భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండే మహద్భాగ్యానికి దూరం కాకండి..
సర్వేజనా సుఖినో భవంతు.