YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రీస్తు జననం దివ్య సందేశం, మానవాళికి శుభ సమయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు

 క్రీస్తు జననం దివ్య సందేశం, మానవాళికి శుభ సమయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు
కరుణామయుడు లోక  రక్షకుడుగా దివి నుంచి భువికి వచ్చిన శుభ సందర్భమే క్రిస్మస్ పండుగ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.  ఏసు క్రీస్తు ఆగమనమే ఒక దివ్య సందేశమని, విశ్వమానవ హితానికి శుభ సమయమని  అన్నారు. రాష్ట్రంలో, దేశ విదేశాల్లోని క్రైస్తవ సోదర, సోదరీ మణులకు సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు క్రీస్తు ప్రపంచ శాంతి సందేశాన్ని అందించిన మహోన్నతుడని, ప్రజలంతా సన్మార్గంలో నడచి సంతృప్తిగా జీవించాలని చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు  విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని అన్నారు. సర్వమానవ సమానత్వం, శాంతి, సహనం,  ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని క్రీస్తు శతాబ్దాల క్రితమే ప్రబోధించారని సీఎం గుర్తుచేశారు. ఈ భూమ్మీద పుట్టిన మనుషులందరిలో దైవత్వం వుంటుందని, తోటివారి పట్ల ప్రేమాస్పదంగా ప్రవర్తించిన ప్రతిఒక్కరూ దైవసమానులే అని క్రీస్తు ప్రపంచానికి చాటారని ముఖ్యమంత్రి శ్లాఘించారు.
 క్రైస్తవ  సంక్షేమం కోసం తమ ప్రభుత్వం  అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం  గుర్తుచేశారు. కుట్టుమిషన్ల పంపిణీ, క్రిస్మస్ కానుకలు, చర్చిల నిర్మాణం-మరమ్మతులకు రూ. 250 కోట్లు కేటాయించామని చెప్పారు.  క్రిస్మస్ పండుగను సంతోషంగా నిర్వహించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ను  స్వీకరించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు విజ్ఞప్తి చేశారు.  పవిత్ర జెరూసలేం యాత్రకు రూ.7 కోట్లు ఖర్చు పెట్టామని, రూ.10 కోట్లతో గుంటూరులో క్రైస్త వ భవనం నిర్మించామని, అదనంగా మరో ఆరు కోట్ల రూపాయలు  కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని చర్చి పాస్టర్లకు వర్తింపజేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో నిర్మిస్తున్న ‘క్రిస్టియన్ భవన్’కు గతంలో రూ.10 కోట్లు కేటాయించామని,తాజాగా రూ.6 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో క్రిస్టియన్ల స్మశాన వాటికలకోసం రూ.100 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక కింద క్రైస్తవ నవ వధువులకు ఒక్కొక్కరికీ రూ.50 వేలు, విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్ధులకు విద్యోన్నతి కింద రూ. 15 లక్షల ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రానున్న కాలం రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైనదని, రాష్ట్రాభివృద్ధికి తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు తమకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రార్థనలు చేయాలని క్రైస్తవులకు పిలుపునిచ్చారు.

Related Posts