దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి అపూర్వ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చింతమనేని అనుచరుల వేధింపులతో తాను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెప్పారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఇంటర్వ్యూ లో అపూర్వ దెందులూరు ఎమ్మెల్యే ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.