దేశ ప్రధాని మోడి టిడిపి పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఎదుటివారి పై విమర్శలు చేసే ముందు మోడి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోడి నియంతృత్వ ధోరణి తో పాలన సాగిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామని సాధినేని విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బిజినెస్ చేస్తూ జనాలను పీడించుకుని తినే పార్టి బిజెపి. దేశంలో కీలక రంగాలను కార్పొరేట్ పరం చేసిన ఘనత మోడిది. అదేమని ప్రశ్నించిన పార్టీ లను టార్గెట్ చేసి దాడులు చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సిబిఐ, ఈడి వంటి రాజ్యాంగ బద్ద సంస్థ లను తన సొంతానికి వాడుకుంటున్నారు. రాఫెల్ కుంభకోణం బయటకు రాకుండా కాగ్ నోరు మూయించారు. సైద్ధాంతిక సిద్దాంతాలు ఏమాత్రం లేని పార్టి బిజెపిఅని ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో మహాకూటమి బలపడుతుందనే భయంతో మోడి విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలలో ఎపి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోడి మోసం చేశారు. న్యాయ బద్దం గా ఎపికి రావాల్సిన నిధులు ఇమ్మంటే దాడులు చేయిస్తారా అని నిలదీసారు. జనవరి ఆరో తేదీన ఎపి లో బహిరంగ సభ లో మోడి తాను చేసిన మోసాన్ని ప్రజలకు చెప్పాలి. లేదా పర్యటనకు ముందే కేంద్రం ఎపి కి ఏమేమి చేసిందీ దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసారు. ప్రతిపక్షాలు, మీడియా ను గొంతు నులిమేయాలని చూస్తున్నారు. బిజెపిని ఓడించి, మోడిని గద్దె దింపేవరకు మా పోరాటం కొనసాగిస్తామని ఆమె అన్నారు.