YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయం : ఉప ముఖ్యమంత్రి

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయం : ఉప ముఖ్యమంత్రి

అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి కే.ఈ.కృష్ణమూర్తి అన్నారు.  సోమవారం సునయన ఆడిటోరియంలో చంద్రన్న క్రిస్మస్ , సంక్రాంతి కానుకలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశం మత సామరస్యానికి పేరుగాంచిందన్నారు.  కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి భావించి క్రిస్టియన్ లకు క్రిస్మస్ , ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలను అందిస్తున్నారని తెలిపారు.  మైనారిటీల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి గత నాలుగు సంవత్సరాలు గా రూ.3 వేల కోట్లను ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.  కోల్స్ కాలేజీలో తాను, తన తమ్ముడు కె.ఈ ప్రభాకర్ చదివామని,  క్రిస్టియన్ లతో  ఉన్న తమ అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ కుల,మతాలకు, ధనిక, పేదలకు అతీతంగా పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఉచితంగా పండుగ సరుకులను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.  ఇవే కాక పేద ప్రజల సంక్షేమాభివృద్ధికి దాదాపు 100 కు పైగా పథకాలను ప్రవేశపెట్టి పేదవారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.  ఎమ్మెల్సీ కే. ఈ.ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు ఆనందంగా పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.   ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఏడు రకాల వస్తువులను ఒక బ్యాగులో ఉంచి ఉచితంగా ఇస్తున్నామన్నారు.  దళిత క్రిస్టియన్లను దళితులుగా గుర్తించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  కర్నూలు పట్టణంలో చర్చీల మరమ్మత్తులకు రూ.8.50 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో ఇప్పటికే రూ.4.40 కోట్లు విడుదలచేసి అందించిందన్నారు.  జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నిరు పేద ఆనందంగా పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం భావించి రూ.208లు విలువైన ఏడు రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నదన్నారు.  ఇందులో బెల్లం 500 గ్రా., గోధుమ పిండి ఒక కే జి, , శనగలు 500 గ్రా., కంది పప్పు 500 గ్రా., పామ్ ఆయిల్ అర లీటర్, నెయ్యితో కలిపి ఒక సంచిలో ఉంచి లబ్దిదారులకు ఇస్తున్నామన్నారు.  జిల్లాలో మొత్తం 11.82 లక్షల బి.పి.ఎల్ కార్డు దారులుండగా, ఇందులో 1.41లక్షల బిపిఎల్ కార్డులు కలిగిన క్రిస్టియన్లను కానుకలను అందిస్తున్నామన్నారు.  వీటికి రూ.28 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు.  అన్ని రేషన్ దుకాణాల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటలనుంచి రాత్రి వరకు ఈ వస్తువులను పంపిణీ చేస్తారన్నారు.  నాణ్యత బాగాలేక పోతే వెనక్కి ఇస్తే మంచి సరుకులు తీసుకోవచ్చునన్నారు.  అనంతరం లబ్దిదారులకు సంచితో కూడిన ఏడు రకాల వస్తువులను అందించారు.   అంతకు ముందు పాస్టర్ రవికుమార్ ప్రేయర్ చేశారు. 

Related Posts