YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సునామీ ధాటికి 281కు చేరిన మృత్యులు

సునామీ ధాటికి 281కు చేరిన మృత్యులు

ఇండోనేసియాలోని జావా, సుమత్ర దీవుల్లో సంభవించిన సునామీ కారణంగా మరణించిన వారి సంఖ్య సోమవారానికి 281కి చేరింది. క్రాకటోవా ‘శిశువు’గా పిల్చుకునే ఓ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైంది. సరిగ్గా 24 నిమిషాల తర్వాత నీటి లోపల భూమి కంపించి సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. సునామీ ధాటికి బీచ్‌లు క్షణాల్లో బీచ్‌లు మృత్యుదిబ్బలుగా మారాయి. వేల చెట్లను సునామీ కూకటివేళ్లతో సహా పెకిలించింది. రాకాసి అలల ధాటికి సుమత్రా, జావా దీవుల మధ్య గల సుందా జలసంధి దారుణంగా దెబ్బతింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జావా ద్వీపంలోని పండెగ్‌లాంగ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కలపతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు ఒకదానిపైకి ఒకటి ఎక్కి కూర్చున్నాయి. కూలిపోయిన ఇళ్లు, కలప మధ్య ఎవరైనా చిక్కుకున్నారేమో అని రెస్క్యూ టీమ్‌లు అన్వేషిస్తున్నాయి. ఇండోనేసియాకు సునామీలు, భూకంపాలు కొత్తేమీ కాదు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 13 దేశాల్లో రెండు లక్షల 26వేల మంది చనిపోయారు. వీరిలో కేవలం ఇండోనేసియా నుంచే ఒక లక్షా 20వేల మంది ఉండటం గమనార్హం. ఇక క్రకటోవా అగ్నిపర్వతం వల్ల సంభవించిన సునామీల కారణంగా ఇండోనేసియాలో 1883లో 36వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు

Related Posts