‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆంధ్రప్రదేశ్లో విడుదల కాదని దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తెలిపారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఏపీలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ సినిమాకు కొందరు మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం అండదండలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ సెన్సార్ అవుతుంది. కానీ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాను రద్దు చేయొచ్చు. రెండు మతాలను ఉద్రేక పరిచే సినిమాలా ఉందని విశ్వరూపం సినిమాను తమిళనాడులో జయలలిత ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రికి ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్తోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రద్దు చేయొచ్చు. ఎన్నికల కోడ్ రాకముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నంత వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదలయ్యే అవకాశం ఉండదని అయన అన్నారు. . ఒకవేళ అప్పటికే ఎన్నికల కోడ్ వస్తే ఆ సినిమా ఆటోమేటిక్గా విడుదల అవుతుంది. ఎన్నికల కోడ్ రాకముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదలయ్యే అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ సినిమాతో పాటు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా విడుదల కాకపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు చిత్రాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు, పార్టీ పేరును వాడుతున్నారు. రాజకీయ పార్టీ పేరు, జెండాలు ఉన్నందున ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ సినిమాల విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వదని అయన అన్నారు.