YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పైకా విద్రోహం పై స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేసిన ప్రధాని ఐఐటి భువనేశ్వర్ ఆవరణ ను దేశ ప్రజల కు అంకితం

పైకా విద్రోహం పై స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేసిన ప్రధాని ఐఐటి భువనేశ్వర్ ఆవరణ ను దేశ ప్రజల కు అంకితం

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ సోమవారం ఒడిశా ను సందర్శించారు. ఈ సందర్బంగా అయన పైకా తిరుగుబాటు కు సంబంధించిన స్మారక తపాలా బిళ్ళ ను,  నాణేన్ని  ఐఐటి భువనేశ్వర్ ఆవరణ లో అయన విడుదల చేశారు.  బ్రిటిషు పాలన కు వ్యతిరేకంగా 1817 వ సంవత్సరం లో ఒడిశా లో పైకా తిరుగుబాటు (పైకా బిద్రోహ) చోటు చేసుకొంది. భువనేశ్వర్ లోని ఉత్కళ్ విశ్వవిద్యాలయం లో పైకా తిరుగుబాటు కు సంబంధించిన ఒక చైర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. తరువాత అయన లలిత్గిరి వస్తు ప్రదర్శన శాల ను ప్రారంభించారు.  లలిత్గిరి ఒడిశా లో ఒక ప్రసిద్ధమైన పురావస్తు ప్రాముఖ్యం కలిగిన బౌద్ధ కేంద్రం. ఇక్కడ ఒక స్థూపం,విహారాలు, బుద్ధ భగవానుని విగ్రహాలు ఉన్నాయి. ఆ తరువాత ఐఐటి భువనేశ్వర్ ప్రాంగణాన్ని  మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు.  భువనేశ్వర్ లో నూతనం గా నిర్మాణమైన ఇఎస్ఐసి ఆసుపత్రి ని కూడా ఆయన ప్రారంభించారు.  

ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజున ప్రారంభమైన పథకాల మొత్తం విలువ 14,000 కోట్ల రూపాయలకు పైగానే ఉందన్నారు.  ఆగ్నేయ ఆసియా కు ఒక ముఖ ద్వారం గా తూర్పు భారతావని ని తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వం ధ్యేయమని ఆయన తెలిపారు. ఒడిశా లో పారిశ్రామిక అభివృద్ధి కి ఐఐటి భువనేశ్వర్ అండగా నిలుస్తుందని, ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు తగిన సాంకేతిక విజ్ఞానం దిశ గానూ కృషి చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను, రోడ్ నెట్ వర్కు ను మరియు చమురు- గ్యాస్ గొట్టపు మార్గ సంబంధ అవస్థాపన ను విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  ఒడిశా సర్వతోముఖ పురోగతి దిశ గా కేంద్ర ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

Related Posts