YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి                తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మమతాబెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు. గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం వెల్లడించారు. ఫెడరర్ ఫ్రంట్ ఏర్పాటుపై నిన్నటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయనిఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి..బలోపేతం కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా పర్యటనను పూర్తి చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా నగరానికి చేరుకున్నారు. కోల్‌కతా చేరుకున్న సీఎంకు పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలూ భేటీ అయ్యారు. మమతతో భేటీ అనంతరం కాళీమాత ఆలయాన్ని సందర్శించి.. అక్కడి నుంచి కేసీఆర్‌ దిల్లీకి పయనమవుతారు. రేపటి నుంచి రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్‌ దిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ ఆయన దిల్లీలో భేటీ కానున్నారు. దేశంలో భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కల్గిన పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా మమతతో మరోసారి కేసీఆర్‌ కీలక చర్చలు జరపనున్నారు.

Related Posts