YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

పాదయాత్రకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి..?

Highlights

  • కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు
  • రోజుకు 15 కి.మీ చొప్పిన 120 కి.మీ మేర 
  •  పెండింగ్‌ పనులు, కొత్త ప్రాజెక్టులే అజెండా
  • కాంగ్రెస్ ల్లో కీలక పరిణామాలకు నాంది..?
పాదయాత్రకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి..?

 తెలంగాణలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎవరికి వారు విడివిడిగా పాదయాత్రలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు పార్టీ అధిష్టానం అనుమతి కోరారు.

టీపీసీసీ రాష్ట్ర కార్య నిర్వాకం అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు కూడా పాదయాత్ర కోసం సమయాత్తమయ్యారు. అయితే అందుకు అధిష్టాన వర్గం నుంచి సానుకూలమైన సమాధానం రాకపోవడంతో భట్టి తన రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో  అయన తానూ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నోయోజకవర్గానికే పరిమితం అయినట్టుగా ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి చేపట్టబోయి పాదయాత్ర ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. సమీప భవిష్యత్తులో ఈ పాదయాత్ర కీలక  రాజకీయ పరిణామాలకు నాంది పలకనున్నాడన్న వాదన ఆ పార్టీలో వినవస్తుంది. ఏ ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం  పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఆయన త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


కాగా రేవంత్ రెడ్డి చేపట్టబోయి  పాదయాత్రకు సంబంధించిన తేదీ ఇంకా వెల్లడికాలేదు. వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలు డిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. ప్రతి రోజూ రేవంత్ రెడ్డి 15 కి.మీ. పాదయాత్ర చేసే అవకాశముంది. కొడంగల్, బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌ మీదుగా వికారాబాద్‌ చేరుకుంటారు. కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లి చౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకోనున్నారు. తన పాదయాత్రకు రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతి కోరినట్లు తెలుస్తోంది. 

Related Posts