విజయవాడ సీఎస్ఐ సెయింట్ పాల్స్ బిసిలికా చర్చిలో మంగళవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రైస్తవ మతపెద్దలతో కలసి చర్చిలో ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో ఉందని అన్నారు. మానవ జన్మలో కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయని అన్నారు. నీతి, నిజాయితీకి అందరూ కట్టుబడాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్ మిషనరీ స్థాపించిన స్కూళ్లలో చదివినవారు, ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. సేవా దృక్ఫథంతో చేపట్టిన పనులు విజయం సాధిస్తాయని చెప్పారు. మదర్ థెరిస్సా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం నుంచి జనవరి 1 వరకూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతామని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే బోండా ఉమా, కలెక్టర్ లక్ష్మీకాంతం పాల్గొన్నారు