మాజీమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజవర్గానికి స్వయంగా ఇచ్చిన యాభై ఆరు హామీలు అమలు విషయంలో విఫలమయ్యరు. దీనిపై మనస్థాపం చెందే ఈ నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీలు 56 జీవోలు ఇచ్చి కార్యరూపం దాల్చకపోవడం కక్ష సాదింపేనని విమర్శించారు. నేను ఈ నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి నాపై, నా నియోజకవర్గ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నార. ఈ నియోజకవర్గానికి చెందిన సమస్యలు విషయంలో గత మూడు నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడి స్థానిక తెలుగుదేశం నేతలు ఒత్తిడి కారణంగానే ఈ నియోజకవర్గ పనులు ఉద్దేశ్యపూర్వకంగా నిలుపదల చేశారు. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని మీకు పంపిస్తున్నా, 15రోజుల్లో వాటిని అమలుచేయని పక్షంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు. ఇటువంటి శాసనసభలో సభ్యుడిగా ఉండేందుకు నాకు సిగ్గుగా ఉంది. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలుచేయని పక్షంలో నేను మీకు పంపిన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపి మీరే ఆమోదం చేయించండని అయన ముఖ్యమంత్రికి సూచించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవడంపై మనస్తాపం చెందానని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు.