గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం కోటప్పకోండలో హిల్ పెస్టివల్ నిర్వహణకు సంబంధించి వివిధ కాలేజీల ప్రతినిధులు, అధికారులతో స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నాడు నరసరావుపేట స్పీకర్ కార్యాలయంలో నిర్వహించిన రివ్వూలో జనవరి 19, 20 న నిర్వహించే ఈ పెస్టివల్ నిర్వహణకు 12కమీటీల ఏర్పాటు కు నిర్ణయించారు. పోగ్రామ్స్, పైనాన్స్, స్పోర్ట్స్, రిసెప్షన్, కల్చరల్, మీడియా, వెబ్ డెవలప్ మెంట్, మెడికల్, ట్రాన్స్ పోర్ట్, కోఆర్డినేషన్, ఇలా మొత్తం 12 కమిటీలు వేయాలని నిర్ణయించారు. తరువాత స్పీకర్ కోడెల మాట్లాడుతూ మొదటి రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రెండో రోజు గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వస్తారు.నరసరావుపేట చరిత్రలోనే ఇదో మైలురాయిగా మిగిలిపోవాలని అన్నారు. ప్రపంచంలోనే మొదటిసారి నిర్వహించే ఈ పెస్టివల్ చరిత్రలో మిగిలిపోవాలి. జనవరి 7న నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుండి స్టేడియం వరకూ బారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణం, చెట్లు , కోండల యొక్క గోప్పతనం వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.