Highlights
- టెట్ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 21 వ తేదీ nunchi టెట్ పరీక్షలు జరుగుతాయని రాత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. గురువారం అయన టెట్ నిర్వహణపై సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరైనా ఈ సమావేశంలో టెట్ నిర్వహణ, పరీక్షా కేంద్రాల కేటాయింపుల గందరగోళంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల కేటాయింపుపై మండిపడ్డారు.. టెట్ నిర్వహణలో మొదటి నుంచి అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. అవసరమైతే మరోసారి టెట్ వాయిదా వేసే ఆలోచన ఉందన్నారు. అధికారులతో సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.