YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీజ,కళ్యాణ్ లు కు కూతురు పుట్టిందోచ్

శ్రీజ,కళ్యాణ్ లు కు కూతురు పుట్టిందోచ్

 క్రిస్మస్ పండుగ రోజున మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులకు మంగళవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం తన భార్య శ్రీజ ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. 2018 క్రిస్మస్ జీవితాంతం గుర్తిండిపోతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా తన చిన్నారి పాప పాదం ముద్రను కూడా పోస్ట్ చేశారు. శ్రీజకు ఇప్పటికే ఒక పాప ఉంది. ఆ రు. కాగా, శ్రీజ వివాహం కళ్యాణ్ దేవ్‌తో 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, కుటంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో శ్రీజ, కళ్యాణ్‌ల రిసెప్షన్ జరిగింది. ఇదిలా ఉంటే, చిన్నల్లుడంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని ఉందని చెప్పగానే చిరంజీవి పచ్చజెండా ఊపారు. విశాఖపట్నంలో ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించారు. ‘విజేత’ సినిమాతో ఆరంగేట్రం చేయించారు. ఇప్పుడు కళ్యాణ్ తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిస్మస్ రోజున శ్రీజకు ఆడబిడ్డ జన్మించడం అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానుల్లోనూ ఆనందం నింపింది.

Related Posts