సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడంపై కాంగ్రెస్ పార్టీ
దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితి సజావుగా లేదంటూ, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పడం అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ... దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును ఈ పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పరిస్థితులను తక్షణం సరిదిద్దాలని, లేకపోతే దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.