Highlights
- జేఎఫ్ సీ కి కలిసొస్తున్న మిత్రపక్షాలు
- పవన్ తో ఇబ్బందిలేదంటున్న బాబు..
- పవన్ ఎవరంటున్న బాలయ్య
కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన విభన హామీల అమలుపై నిజ నిజాలు తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. శుక్రవారం హైదరాబాద్ లో అయన ఆధ్వర్యం లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చారు..ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చింది ?, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఖర్చు చేసింది..అన్న అంశాలపై ఆయా ప్రభుత్వాలను నిలదీసేందుకు పవన్ సమాయత్తమయ్యారు.
ఈ క్రమంలో అయన ఇప్పటికే ఉండవల్లి...జయ ప్రకాష్ నారాయణ్ తో జేఎఫ్ సీ ఏర్పాటు చేశారు. ఈ జేఎఫ్ సీలో ఇతర మేధావులు..కీలక నేతలు ఉంటారని పవన్ పేర్కొన్నారు. అందులో భాగంగా పలువురు నేతలు..మేధావులతో పవన్ మాట్లాడారు. ఈ క్రమం లో గురువారం ఉదయం ఏపీ సీపీఎం, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో పవన్ మాట్లాడారు. శుక్రవారం నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదే విధంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కూడా పవన్ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ హాజరవుతారని రఘవీరా తెలిపారు. ఈ సమావేశం అనంతరం పవన్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తారో వేచి చూడాలి మరి.
ఇది ఇలా ఉండగా పవన్ జేఎఫ్ సీతో తమకు ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారు. పవన్ పోరాటంలో అర్థం ఉందని, రాష్ట్రానికి మేలు జరగాలను కాంక్షతో ఆయనకు తోచిన విధంగా పవన్ వెళ్తున్నాడని చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తెలిపారు. పవన్ విషయం లో చంద్రబాబు వైఖరి ఇలా ఉంటే అయన బావ మరిది నందమూరి బాలకృష్ణ మరో అడుగు ముందుకు వేశారు.. "పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదాని బాలయ్య అనాధ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకే మద్దతును ఇచ్చి ప్రచారం చేశారు పవన్. ఇలా తమ పార్టీకే ప్రచారం చేసిన వ్యక్తిని బాలకృష్ణ తెలీదని చెప్పడం విమర్శకు దారితీసింది.. మరి బాలయ్య స్పందనపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.