YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వృద్దికి వ్యవసాయం పునాది శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

వృద్దికి వ్యవసాయం పునాది శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఉండవల్లి ప్రజావేదికలో నాలుగవ శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసారు. నాలుగున్నరేళ్లుగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం రూపోందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వ్యవసాయం అత్యంత పవిత్రమైన వృత్తిగా ఎంఎస్ స్వామినాథన్ చెప్పారు. వృద్ధికి వ్యవసాయం పునాది. వ్యవసాయరంగంలో ఎంత పురోగతి సాధిస్తే మిగిలినరంగాల్లో అంతగా వృద్ధి సాధిస్తామని స్వామినాథన్ చెప్పారు. కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయంపై ఆధారపడిన జనాభాలోని 65% మంది ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడాలని అన్నారు. కల్తీ విత్తనాలు, నీటి ఎద్దడి, కోనసీమలోనూ క్రాప్ హాలిడే 2004-2014 మధ్య కాలం నాటి పరిస్థితి. నాడు రాయలసీమలో కరువు, కోస్తాలో తుఫాన్లు, వలసలు, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వంటి ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయి. కేంద్రాన్ని రుణ మాఫీకి సహకరించమని కోరినా కనికరించలేదు, పైగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 16 వేల కోట్ల రూపాయల లోటులో కోత విధించింది. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒకేసారి రూ.50 వేలు ఒకే విడతలో రుణమాఫీ చేశాం. ఆ తర్వాత నుంచి 10% వడ్డీ చెల్లిస్తూ నాలుగు విడతలుగా రూ. 24 వేలు కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు. 62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయి, మరో ఆరు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పట్టిసీమ పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువచ్చాం.. కృష్ణా డెల్టాకు రావాల్సిన కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాం. కృష్ణా డెల్టాలో ఆక్వాకల్చర్లో మరింత వృద్ధి తీసుకువచ్చాం.ఆక్వాకల్చర్కు అధికప్రాధాన్యత సాధించామని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధి సాధించగలిగాం. నాణ్యమైన విత్తనాలు, గిట్టుబాటు ధర, సూక్ష్మపోషకాల పంపిణీ, నీరు ఇవ్వడం, కౌలురైతులకు రుణాలు ఇలా ఎన్నో చేశామని చెప్పారు.  దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువుగా నమోదవుతున్నా రాష్ట్రంలో అనూహ్యంగా రైతు ఆత్మహత్యలు తగ్గించగలిగాం. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మలచాలనేది నా ఆశయం. విత్తన భధ్రత, విద్యుత్ భద్రత, నీటి భద్రత ఇచ్చాం, పంటకుంటలతో భూగర్భ జలాలు పెంచాం. ప్రధాన నరేంద్రమోదీ నాలుగు సంవత్సరాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. మేం ఇప్పటికే రెట్టింపుచేసి చూపించాం. నాలుగు సంవత్సరాలలో 97% రెట్టింపు అయ్యేలా రైతుల ఆదాయాన్ని పెంచగలిగామని అన్నారు. వ్యవసాయరంంగంలో నాలుగేళ్లలో సరాసరి 11% వృద్ధితో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటిస్థానంలో ఉంది. ఐదు సంవత్సరాలు వర్షపాతం సాధారణం కన్నా తక్కువుగా ఉన్న వ్యవసాయరంగంలో వృద్ధి సాధించడం విశేషం. సుస్థిర వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి నమోదయింది. 

సంవత్సరం     వర్షపాతం     (GVA)  వ్యవసాయ వృద్ధి

2014-15    -37.30%      09.20%    03.55%

2015-16    -05.50%      10.60%    07.80%

2016-17    -29.90%      11.07%    14.91%

2017-18    -14.40%      11.22%    17.76%

2018-19    -34.70%      11.15%    17.18%

వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టాం. 2013-14లో రూ.6,128 కోట్లు(4.5%)గా ఉన్న వ్యవసాయ బడ్జెట్ను 2018-19 నాటికి రూ.19,070 కోట్లు(10%)కు పెంచాం. వరుసగా మూడేళ్లు సాయిల్ హెల్త్ కార్డులు అందివ్వడంలో అవార్డులు సాధించాం. 2017-18, 2018-19 సంవత్సరాలకు గాను నూరు శాతం సబ్సిడీపై 20.04 లక్షల హెక్టార్లకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలు పంపిణీ చేశామని అన్నారు. వ్యవసాయ శాఖలో 4,095 మంది ఎక్సటెన్షన్ ఆఫీసర్లను రైతులకు అందుబాటులో వున్నారు. రూ. 24 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. ఇందులో ఇప్పటివరకు రూ.15,147 కోట్ల రుణ ఉపశమనం కల్పించాం. వ్యవసాయ, ఉద్యానవనరంగ రైతులకు చెందిన 58.29 లక్షల ఖాతాలకు 10% వడ్డీతో సహా రుణాలు మాఫీ చేశాం. కర్నూలు జిల్లా తగడెంచలో 650 ఎకరాల్లో రూ.670 కోట్లతో ఐయోవా యూనివర్సిటీ భాగస్వామ్యంతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు అవుతోందని వెల్లడించారు.

Related Posts