YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన ఘనత మాదే

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన ఘనత మాదే

ఏపీ ప్రభుత్వం నాలుగో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలువుతున్న కార్యక్రమాలపై పత్రాన్ని విడుదల చేశారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. వ్యవసాయంలో సాధించిన ప్రగతిని వివరించారు. 2014కు ముందు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు సీఎం. కోనసీమలో క్రాఫ్ హాలిడే ప్రకటించిన పరిస్థితి ఉందని.. 2014 తర్వాత రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచామన్నారు. విత్తన, విద్యుత్, నీటి భద్రతను ఇచ్చామన్నారు. వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. నాలుగేళ్లలో దేశంలో వ్యవసాయానికి అత్యధికంగా ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు చంద్రబాబు. రైతులకు రుణమాఫీ చేసి భరోసా పెంచామని.. వారికి ప్రభుత్వంపై కూడా నమ్మకం పెరిగిందని చెప్పారు. రుణమాఫీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని.. రుణమాఫీకి సహకరించకుండా ఆర్బీఐని కేంద్ర అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.16వేల కోట్లలో కోత విధించిందన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయంలో 11శాతం వృద్ధితో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం చెప్పారు. ధనిక రాష్ట్రాలు కూడా చేయని విధంగా రూ.1.50లక్షల వరకు రుణాలను మాఫీ చేశామన్నారు. 50వేలులోపు రుణాలు ఒకేసారి మాఫీ చేశామని గుర్తు చేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేదని విధంగా కౌలు రైతులకు రూ.9,411 కోట్లు ఇచ్చామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయని.. ఏపీలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ఐదేళ్లు తక్కువ వర్షాలు పడ్డా.. ప్రాజెక్టుల ద్వారా పంట్నలి కాపాడుకోగలిగామన్నారు చంద్రబాబు. నీళ్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో ముందుకెళ్లామని.. పంటకుంటలతో భూగర్బ జలాలను పెంచామన్నారు. నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామని.. కృష్ణా డెల్టాకు ఇచ్చే నీటిని రాయలసీమకు తరలించామన్నారు. 62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని. మరో ఆరు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు

Related Posts