YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుండటంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. వారం వ్యవధిలో సమ్మె జరగడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల్లో 85 వేల మంది బ్యాంకు ఉద్యోగులు విధులకు దూరమయ్యారు. సమ్మె ఫలితంగా బ్యాంక్‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే వినియోగదారులకు సమ్మె సమాచారాన్ని పలు బ్యాంకులు చేరవేశాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు యథావిథిగా కొనసాగుతున్నాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), ఎన్‌సీబీఈ, ఎన్‌ఓబీడబ్ల్యూ సహా తొమ్మిది యూనియన్‌ల సంయుక్త సంఘమైన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా 2018, అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.4,285 కోట్ల నుంచి రూ.4,532 కోట్లకు పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.67,026 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక ముందూ ఇదే ధోరణి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఐడీబీఐ బ్యాంకులోని వాటాను ఎల్‌ఐసీకి అమ్మేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంకును విలీనం చేసి దేశంలోనే అతిపెద్ద మూడో బ్యాంకును రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అలాగైతే ఆ బ్యాంకు మొత్తం విలువ రూ.14.8 లక్షల కోట్లు ఉంటుంది. విలీనం జరిగితే ఆర్థికంగా బలపడుతుంది. ప్రభుత్వ బ్యాంకుల సగటు ఎన్‌పీఏ నిష్పత్తి 12.1 శాతంతో పోలిస్తే దీనిది తక్కువగా 5.7 శాతం ఉంటుంది.

Related Posts