ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ముస్లిం, మైనారిటీ విద్యార్దిని విద్యార్ధులకు ఉచిత కంప్యూటర్ డీటీపీ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తున్నలట్లు ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ అకాడమీ చెర్మన్ నౌమాన్, డైరెక్టర్ సెక్రటరీ సయ్యద్ మస్తాన్ వలి తెలిపారు. విద్యార్ధులుకు ఈ నెల 06 తారీకు ఆదివారము ప్రవేశ పరీక్షా ఉంటుందని అన్నారు. ప్రవేశ పరీక్షకు హజరయ్యే వారు పదవ తరగతి పాసై వయస్సు 35 సంవత్సరాలు మించరాదని అన్నారు. ఇదివరకు ఉర్దూ అకాడమీ శిక్షణ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయరాదని సూచించారు. విద్యార్ధులకు జనవరి రెండవ వారం లో తరగతులు ప్రారంభమయి ఆరు నెలలు జరుగుతాయి. మిగిలిన సమాచారము కొరకు ఉర్దూ అకాడమీ సెంటర్ ఇంచార్జ్ సెల్ నెంబర్: 9391775902 ఉర్దూ అకాడమీ ఆంద్రప్రదేశ్ స్టేట్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ బాలభవనం ప్రక్కన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఉర్దూ భవనం, కర్నూలు ను సంప్రదించాల్సిందిగా సూచించారు.