యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో :
జయప్రకాష్ నారాయణ.. మాజీ ఎమ్మెల్యే , మాజీ ఐఏఎస్ ఆఫీసర్, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు. 1996 లో జయప్రకాశ్ నారాయణ గారు "లోక్ సత్తా మూమెంట్" మొదలు పెట్టి యువతతో, ప్రజలతో మమేకమై ఓటు యొక్క ప్రయోజనాలు, ప్రజలు యొక్క హక్కుల కోసం చెప్పి వారిలో మార్పు తీసుకుని వచ్చారు. తరువాత ప్రత్యేక్షంగా 2006 లో 'లోక్ సత్తా' అనే రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నో సిద్ధాంతాలతో, దేశ రాజకీయ భవిష్యుత్తును మార్చేందుకు మొదట అడుగు వేశారు.. కులాలకు, మతాలకు అతీతంగా అయన పార్టీ స్థాపించి ఎంతో మంది యువతను చైతన్య పరిచారు. అయన తొలిసారి 2008 లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 2014 లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అయన కానీ, అయన పార్టీ లోక్ సత్తా కానీ ప్రత్యక్షంగా, పరోక్షకంగా రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు.
ఆ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'ఫాక్ట్ ఫైండింగ్ కమిటి' అని ఒక కమిటి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టిన కమిటి చూసి ఆయనకు నచ్చి ఆ కమిటీలో మెంబెర్ గా చేరారు. తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చక అయన ఆ కమిటీకి దూరమయ్యారు.
మన ఓటర్లు, ప్రజలు సిద్ధాంతాలతో పెట్టిన పార్టీలకు, సిద్ధాంతాలు ఉన్న నాయకులను పట్టించుకోరు. కులానికో, మతానికో, డబ్బుకో, సారా కో ఆశ పడి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలది కానీ, రాజకీయ నాయకులది కానీ ఎంటువంటి తప్పు లేదు.. తప్పు అంత ప్రజలదే. ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే లంచాలకు ఆశపడి లంచాలు తీసుకునే నాయకులకు ఓటు వేసి.. అధికారం కట్టబెట్టి చివరికి ఆ పార్టీ కి సిద్ధాంతాలు లేవు - ఈ పార్టీకి మేనిఫెస్టోలు లేవు అని విమర్శిస్తారు. అపుడెపుడో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నట్టు ప్రజలందరూ డ్యాష్.. డ్యాష్యే ఇప్పటికైనా ప్రజలు అందరు ఆలోచన సరళిని మార్చుకుని సరైన నాయకులను.. సరైన పార్టీలను అధికారంలో కూర్చోబెట్టి మన దేశ అభివృద్ధిని చెందడంలో తమ వంతు కృషి చేస్తారని ఆకాంక్ష..