Highlights
- నరబలి కేసులో పురోగతి..
- డీఎన్ఏ రిపోర్టులో వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌లోని శిశువు నరబలి కేసులో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. ఉప్పల్ చిలుకానగర్ కు చెందిన రాజశేఖర్ ఇంటిపై దొరికిన చిన్నారి తలను ఆడ శిశువుదిగా డీఎన్ఏ రిపోర్టులో తేలింది. శిశువును బోయిగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న వారి నుంచి అపహరించినట్లు గుర్తించారు. రాజశేఖర్ ఇంట్లో లభించిన రక్తపు మరకలు శిశువుదేనని తేలింది. చంద్రగ్రహణం రోజు చంద్రుడి కాంతి శిశువు తలపై పడేలా చేయాలని మంత్రగాళ్లు చెప్పడంతో రాజశేఖర్ దంపతులు ఈ విధంగా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆరోజు ఇంట్లో రాజశేఖర్ దంపతులు ఇంట్లో నగ్న పూజలు చేసి శిశువును బలి ఇచ్చినట్లు వెల్లడించారు. తలను డాబాపై ఉంచగా.. మొండాన్ని ప్రతాప సింగారం సమీపంలో మూసీనదిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.