YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతిని వణికిస్తున్న చలి

అమరావతిని వణికిస్తున్న చలి
 తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు మూడు రోజుల్లో చలి మరింతగా పెరగనుంది. ఇప్పటికే విశాఖ, ఆదిలాబాద్ ఏజెన్సీలు గజగజ వణుకుతుండగా.. ఉత్తరాది గాలుల ప్రభావంతో ఈ చలి మరికాస్త ఎక్కువ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2, 3 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఉత్తరభారతం నుంచి మరో రెండు రోజులు చలిగాలులు వీచే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలుల తీవ్రత మరో రెండు రోజుల పాటు ఎక్కువ కానుందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉందని.. దానికి తోడు పెథాయ్ తుపాను ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ చలి పెరిగిందని అన్నారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం సిబ్బంది తెలిపారు. మరోవైపు మాల్దీవుల ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. రానున్న రెండురోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని అన్నారు. ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదై చలి పెరిగే సూచనలు ఉన్నాయని, గాలిలో తేమ శాతం అధి కంగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ద్రోణి కొనసాగుతోందని, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడులో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు

Related Posts