లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో 17 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఎదురు గాలి వీచిన నేపథ్యంలో.. అప్రమత్తమైన బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో.. పార్టీలోనే ధిక్కార స్వరాలు వినిపిస్తోండటంతో.. వచ్చే ఎన్నికలను బీజేపీ చీఫ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణకు అరబింద్ లింబావాలిని ఇన్‌ఛార్జిగా నియమించిన అమిత్ షా.. ఏపీ ఇన్‌చార్జిలుగా రాజ్యసభ సభ్యుడు మురళీధరన్, పార్టీ కార్యదర్శి సునీల్ దేవధర్‌లను నియమించారు. రాజస్థాన్‌లో ఎన్నికల బాధ్యతలను ప్రకాశ్ జవదేకర్‌కు అప్పగించిన బీజేపీ నాయకత్వం.. కీలకమైన ఉత్తరప్రదేశ్ బాధ్యతలను గుజరాత్‌కు చెందిన గోవర్ధన్ ఝడాపియాకు అప్పగించింది. ఆయనతోపాటు పార్టీ వైస్ ప్రెసిడెంట్ దుష్యంత్ గౌతమ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నరోత్తమ్ మిశ్రాలు యూపీ బాధ్యతలను తలకెత్తుకోనున్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీలుగా వ్యవహరిస్తోన్న భూపేందర్ యాదవ్, అనిల్ జైన్‌లు బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఓపీ మాథూర్‌ను మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ఇన్‌ఛార్జిగా నియమించారు.