కాంతం భర్తకి లెటర్ రాసింది..????
ఫుల్ స్టాప్,కామాలు ఎక్కడపెట్టాలో తెలీక..నచ్చిన చోట పెట్టేసి మరీ రాసేసింది.
" ప్రియాతి ప్రియమైన ఏమండీ"
"మీరింతవరకు లెటర్ రాయలేదేందుకు నా ఫ్రెండ్ కి. ఉద్యోగం దొరికింది మన ఆవుకి. దూడ పుట్టింది తాతగారికి. ఈమధ్య మందెక్కువయ్యింది నాకు. లెటర్ రాయలేదుగా కోపం వస్తోంది కుక్క. తింటోంది బాగా ఇంట్లో సరుకులు. మీరొచ్చేటప్పుడు తీసుకురండి అందమైన అమ్మాయి.తో ఈ మధ్య నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో. చెప్తే మన మేకని. అమ్మేశాడు మార్కెట్లో అత్తగారికి. మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారట ఎదురింటి పంకజానికి. ఈ మధ్య బాగా గర్వం పెరిగింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కండువా తేవడం మర్చిపోవద్దు."
ఇట్లు మీ హృదయస్పందన.
భర్త హృదయస్పందన (BP) బాగానే పెరిగింది.