సింగపూర్ పర్యటనలో వున్న మంత్రి నారా లోకేష్ అక్కడి ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ కార్యాలయంలో ఫారెన్ ఎఫైర్స్ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో సమావేశం అయ్యారు. మంత్రి లోకేష్ కి సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ ను వివియన్ బాలకృష్ణన్ అందించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,అమరావతి నిర్మాణం లో జరుగుతున్న పురోగతి గురించి లోకేష్ వివరించారు. అమరావతి నిర్మాణం,ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ చైన్ వినియోగం,ఐటీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివియన్ బాలకృష్ణన్ ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు. లోకేష్ మాట్లాడుతూ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేసి బ్లాక్ చైన్ తో భద్రత కల్పిస్తున్నాం.అలాగే ఆర్టిఏ లో కూడా బ్లాక్ చైన్ ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాం. సింగపూర్ నుండి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కష్టాలు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ వినియోగంతో తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. అమరావతి అభివృద్ధి కి సింగపూర్ ఇప్పటికే ఎంతో సహకారం అందించింది.మీ నిరంతర సహకారం మాకు కావాలని అయన అన్నారు.