YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చంద్రబాబు భయపడుతున్నారు : బీజేపీ

చంద్రబాబు భయపడుతున్నారు : బీజేపీ
ప్రధాని మోడి ఎపికి వస్తున్నారంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు కు భయం పట్టుకుంది. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు నాలుగేళ్లు గా చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాహుల్ గాందీని విమర్శించిన విధంగా నేడు మోడిని తిడుతున్నారు. చంద్రబాబు తో సహా ఆ పార్టి నేతలు మోడి పై  నీచమైన విమర్శలు చేస్తున్నారు. ఎపి లో బిజేపి బహిరంగ సభ పెట్టకూడదు అనే విధంగా ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. ఎపి ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ తో,  రాహుల్ గాంధీ తో  ఎందుకు కలిశారు. శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న బాబు ఆరు వందల హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని అన్నారు. తన అసమర్థత ను కప్పి పుచ్చుకోవడానికి  బిజెపి పై నిందలు వేస్తున్నారు. కేంద్రం సహకారం లేకుండా నే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన శ్వేత పత్రంలో అన్నీ అబద్దాలేనని అన్నారు. పూర్తి రుణ మాఫీ అన్న చంద్రబాబు సగం కూడా మాఫీ చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలను విస్మరించి కూడా.. అంతా తానే చేసినట్లు డాంబికాలు చెబుతున్నారు. రుణ మాఫీ విషయంలో ఎపి లో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడనేది వాస్తవమని అన్నారు. మూడు పంటలు పండే భూములు కూడా బలవంతంగా తీసుకుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. కేవలం ఆక్వా రంగం మినహా ఏ రంగంలోను అభివృద్ధి లేదు.చంద్రబాబు లాగా సిఎం హోదాలో చెప్పే అబద్దాలు ఏ రాష్ట్రం లోనూ చెప్పలేదు. ఏ ప్రాజెక్టు చేపట్టినా ఇష్టానుసారం గా అంచనాలు పెంచి కేంద్రానికి పంపిస్తున్నారని అన్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చూపకుండా.. కేంద్రం సాయం చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారులకు ఉపాధి చూపించకపోవడంతో వారు వలస వెళ్లిపోతున్నారు. దేశం కాని దేశం వెళ్లి బందీలుగా ఉంటూ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. స్ఫీకర్ కు సంబంధించిన వారి  ఒక కంపెనీకి అనుమతి ఇచ్చి.. వారి వద్దే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం దుర్మార్గమని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నా చంద్రబాబు చర్యలు తీసుకోలేక పోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్కీం పేరుతో ఎమ్మెల్యే అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. ఒకే సర్వే నెంబర్ పెట్టి, 26 మందికి  నాలుగు లక్షలు ఇచ్చారు. ఇలా కోటి రూపాయలు మేర బినామీల పేరుతో దోచుకున్న ఆధారాలు మా వద్ద ఉన్నాయని అయన అన్నారు. 345 సర్వె నెంబర్ లో కూడా పనులు చేస్తున్నట్లు  చూపించి నిధులు స్వాహా చేశారు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ చేసి , బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. పోలవరం కోసం ఉద్యమించిన వారి పై నాడు విమర్శలు చేసిన బాబు.. నేడు తన కల అని ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో ఎప్పుడూ చంద్రబాబు పోలవరం పై తన మానిఫెస్టోలో పెట్టలేదు.బిజెపి మాత్రమే పోలవరం గురించి మానిఫెస్టోలో పెట్టింది. పోలవరం కోసం నిస్వార్థంగా ఎంతో కొంత  పని చేసిన ఏకైక నాయకుడు వైయస్ మాత్రమే. తన తప్పులు బయటకు రాకుండా ఉండేందుకే బాబు ప్రతిపక్షాలు పై ఎదురు దాడి చేస్తున్నారు. విమానాశ్రయం, ఫ్లైఓవర్లు, ఎయిమ్స్, జాతీయ రహదారులు, యూనివర్శిటీ లు..ఇవన్నీ కేంద్రం ఇవ్వకుండానే ఎలా వచ్చాయో బాబు చెప్పాలి. రైల్వే జోన్ , దుగరాజ పట్నం అంశం పెండింగ లో ఉంది. బిజెపి నేతలుగా మేము కూడా వాటి కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. ఆరో తేదీన నిజం పిలుస్తుంది అనే పేరుతో గుంటూరు లో బిజెపి సభ నిర్వహిస్తాం. మోడి కేంద్రం చేసిన సాయం, భవిష్యత్తు లో చేసే పనులు, ప్రకటించే ప్రాజెక్టు ల వల్ల బాబును ప్రజలు నమ్మరనే భయం వారిలో ఉందని మాధవ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిగా మోడి ఎక్కడైనా సభ పెడతారు.  అడ్డుకోవాలని కుట్రలు చేస్తే,  బాబు సభలను మేము కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.

Related Posts