YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏపీ సచివాలయం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏపీ సచివాలయం
ప్రపంచానికే తలమానికంగా రాష్ట్ర సచివాలయం నిర్మాణంవుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  250 మీటర్ల ఎత్తులో భవన నిర్మాణం, 40 అంతస్థులతో నాలుగు భవనాలు, 50 అంతస్థులతో మరో భవనాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. గురువారం నాడు  రాజధాని నిర్మాణంలో ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఒకే రోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఒకే రోజు రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు, కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్లో కొత్త సాంకేతికత తీసుకొచ్చామన్నారు. 56 లక్షల ఎస్ ఎఫ్ టి నిర్మాణం. 13 లక్షల ఎస్ ఎఫ్ టి ఏరియాలో నాలుగు వేల  వాహనాలకు పార్కింగ్ వసతి వుంటుందని అయన వెల్లడించారు. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్గా ఇది అరుదైన ఖ్యాతి.  12 వేల క్యూ.మీ. మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ జరగనున్నది. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదేనని తెలిపారు
రాజధానిలో నూతన సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యంత భారీ భవంతులకు దీటుగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు.  దీనికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా అదే స్థాయిలో చేపడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.  ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణశిల్పి నార్మన్ ఫోస్టర్కి చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ సచివాలయం కోసం ఐదు టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను రూపొందించాం.  ఈ ఐదు టవర్లను ఒకే రాఫ్ట్ ఫౌండేషన్పై నిర్మిస్తున్నామని, అందుకోసం వేల మంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను, టన్నుల కొద్ది నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నాం.  ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ అద్భుత ప్రణాళిక, సీఆర్డీఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకధాటిగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అయన అన్నారు. రాష్ట్రం విడిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం కోసం పనిచేస్తున్నాం. పేదలకు కూడా నివాస గృహాలను నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు,విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీ కొనకళ్ళ నారాయణ రావు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, శాసన సభ్యులు టి.శ్రవణ్ కుమార్,   ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సీఆర్డీఏ కమీషనర్ సీహెచ్. శ్రీధర్, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్,ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు,  రాజధాని రైతులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts